సాక్షి పట్టణంలోని 14,25,32 వార్డుల్లో మహనీయుల జయంతి ఉత్సవాల వాల్ పోస్టర్స్ ఆవిష్కరణ మహనీయుల జయంతి ఉత్సవాల వాల్ పోస్టర్స్ శనివారం బర్రె జహంగీర్ మాజీ మున్సిపల్ చైర్మన్ భువనగిరి ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలోని (వినాయక చౌరస్తా) అంబేద్కర్ చౌరస్తాలో ఏప్రిల్ 14వ తేది శుక్రవారం రోజున మహానీయుల ఉత్సాహ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జయంతి ఉత్సవాల వేడుకలను ఘనంగా నిర్వహించుకునే కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రిని భువనగిరి మున్సిపల్ పట్టణంలోని 25, 32 వ వార్డుల్లో చేతుల మీదగా శనివారం రోజున మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ ఆవిష్కరించారు.
భీమ్ యాత్రను జయప్రదం చెయ్యండి: బర్రె జహంగీర్
మహానీయుల జయంతి ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 05 నుంచి 13 వరకు ప్రతి రోజు అనేక రూపాల్లో అంబేద్కర్ చరిత్ర పై అవగాహన సదస్సు జయప్రదం కోసం ఎప్రిల్ 14న భువనగిరి పట్టణంలో భీమ్ యాత్రను జయప్రదం చేయాలని కోరారు. ఈ సందర్భంగా బర్రె జహంగీర్ మాట్లాడుతూ మహనీయుల త్యాగాలను స్మరించుకునే వేదికగా, వారి ఆశయాల కొనసాగింపులో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ప్రతి కార్యక్రమాన్ని విద్యావంతులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయ సంఘాలు, కుల సంఘాలు, ప్రజాసంఘాలు, భువనగిరి మున్సిపల్ పట్టణంలోని అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బట్టు రాంచంద్రయ్య, దొనకొండ రాములు, ఈరపాక నర్సింహ, బర్రె సుదర్శన్, బండారు రవివర్ధన్, దర్గాయి నర్సింగ్ రావు, బట్టు నర్సింగ్ రావు, కొండమడుగు నర్సింహ, పల్లార్ల వెంకటేశం, అనంపట్ల కృష్ణ, పాశం శివానంద్, బర్రె ప్రమీల, కర్కాల రమేష్, గౌరినివాస్, బర్రె నరేష్, కొల్లూరి రాజు, సందల రాజేష్, నరేంద్ర మహారాజ్, కాకునూరి మహేందర్, బండారు జహంగీర్, సిల్వర్ రమేష్, బసాని మహేందర్, తదితరులు పాల్గొన్నారు.




