రాజోలి 08 ఏప్రిల్ (జనం సాక్షి)రాజోలి… టిఆర్ఎస్ పార్టీతో రానున్న ఎన్నికల్లో జాతీయస్థాయిలో ఎందరో జట్టు కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని జాతీయస్థాయిలో జరిగే ప్రతి ఎన్నికలు టిఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషిం చ నుందని బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావు అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం అన్నారు శనివారం మండల కేంద్రం రాజోలి లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో వారు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యకర్తల సమిష్టి కృషితోనే టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా ఆవిర్భవించిందని ఇప్పటికే ప్రజలకు పథకాలు అందించి దేశంలోనే ఆదర్శనీయ రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని అన్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అక్రమ కేసులకు తెరతీసిందని ప్రజలకు సేవ చేయడం మాని కక్షపూరిత చర్యలను ప్రేరేపిస్తుందని దుయ్యబట్టారు ఇప్పటికీ కూడా దేశంలోని చాలా గ్రామాలలో తాగు సాగునీరు లేక పల్లెలు గొంతేండుతున్నాయని జీవనోపాధి కరువై బతకడమే కష్టంగా మారుతున్న గ్రామాలు ఎన్నో ఉన్నాయని వాటన్నిటిని జీవం పోసేలాగా కేసీఆర్ సారథ్యంలో జాతీయస్థాయిలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు దీనికోసం ప్రతి కార్యకర్త మొక్క బోని ధైర్యంతో ముందుకు సాగాలన్నారు రాష్ట్రంలో అందుతున్న పథకాల పట్ల ఇతర రాష్ట్రాల ప్రజలు రైతులు రాజకీయ పార్టీలు ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారని తమకు కూడా ఇలాంటి పథకాలు అందాలంటే టిఆర్ఎస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుందని దానికోసం కేసీఆర్ తో నడవాలని దేశంలోని ఆయా రాష్ట్రాల ప్రజలు ముందడుగు వేస్తున్నారు రాజోలి మండల అభివృద్ధి కోసం కోట్ల రూపాయల ఖర్చు చేసి ప్రజల సంక్షేమానికి పాటుపడుతున్నామని ప్రతి నెల పెన్షన్లు అందించడంలో ఆయకట్టుకు సాగునీరు అందించడంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను ఆడపడుచులకు అందించడంలో ఎలాంటి జాప్యం చేయకుండా కేసీఆర్ సారథ్యంలో అభివృద్ధికి బాటలు వేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ జంబు రామన్ గౌడ్ జడ్పిటిసి సుగుణమ్మ వైస్ ఎంపీపీ రేణుక ఆర్డిఎస్ మాజీ చైర్మన్ సీతారాం రెడ్డి శ్రీరామ్ రెడ్డి గంగిరెడ్డి ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు




