నెన్నెల, ఏప్రిల్ 26, (జనంసాక్షి )నెన్నెల మండలం కుశ్నపల్లి గ్రామానికి చెందిన వికలాంగ విద్యార్థి ఎల్లూరి శంకర్ కు బుధవారం బిమిని మండలం వెంకటాపూర్ యువత ఆర్థికసాయం అందించారు. ఎల్లూరి శంకర్ చిన్నతనంలోనే కరెంటు ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయిన మొక్కవోని ధైర్యంతో కాళ్లనే చేతులుగా మలుచుకొని పరీక్షలు రాసి, టెన్త్, ఇంటర్ పూర్తి చేసి, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువు తున్నందున స్టడీ మెటీరియల్ కోసం రూ. రెండు వేల రూపాయల ఆర్థిక సాయం చేసినట్లు వెంకటాపూర్ యువత తెలిపారు. ఈకార్యక్రమంలో నగేష్, సాయి, తిరుపతి, అనిల్, రాజేష్, రాకేష్ పాల్గొన్నారు.




