Tuesday, 3 November 2026

పూటకో పార్టీ మార్చే అరుణమ్మ కు కాంగ్రెస్ పార్టీ ని విమర్శించే నైతిక హక్కు లేదు -ఎన్ ఎస్ యూ ఐ జిల్లా అధ్యక్షులు వెంకటేష్.

గద్వాల నడిగడ్డ,జూన్ 26(జనం సాక్షి);అరుణమ్మ కాంగ్రెస్ పార్టీ ని విమర్శించే ముందు తనను తాను ఆత్మ విమర్శ చేసుకుంటే మంచిదనీ,కాంగ్రెస్ పార్టీ లో ఉంటూ పేరు ప్రఖ్యాతలు ,ఆస్తులు సంపాదించి ,రాత్రికి రాత్రి పార్టీ మర్చి ఆస్తులు కాపాడుకోవడానికి బీజేపీ లో చేరి కాంగ్రెస్ పార్టీ ని విమర్శించే ముందు మీ ప్రస్థానం ఎక్కడ మొదలైందో తెలుసుకుంటే మంచిదనీ పూటకో పార్టీ మార్చే అరుణమ్మకు కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదని జోగులాంబ గద్వాల జిల్లా ఏన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అడ్డుపెట్టుకొని అధికార దుర్వినియోగం చేసి ప్రాజెక్ట్ లు పూర్తి చెయ్యకుండ కమిషన్ లకు ఆశపడి రైతుల జీవితాలతో ఆడుకున్న మీకు గద్వాల లో రాజకీయ జీవితం అంధకారం గా మారిందనీ,మీకు నిజాయితీ ఉంటె లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా ను అరెస్ట్ చేసిన మీ కేంద్ర ప్రభుత్వం బిఆర్ఎస్ శాసన మండలి సభ్యురాలు కవిత ను ఎందుకు అరెస్ట్ చెయ్యలేదో చెప్పాలనీ,తెలంగాణ ప్రజలకు తెలుసు బిఆర్ఎస్, బిజెపి ఒక్కటే అని మీరు మోసం చెయ్యాలని చుస్తే ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరనీ,వాస్తవంగా కర్ణాటక ఫలితాలు తెలంగాణ లోనే కాదు దేశం లో ప్రజలలో ఇటు కాంగ్రెస్ కార్యకర్తలలో అటు ప్రజలలో విశ్వాశం నమ్మకం కలుగచేసిందనీ, అరుణమ్మ కర్ణాటక ఎన్నికలలో ఇంచార్జ్ గా ఉన్న ఎన్ని స్థానాలలో గెలిపించారో అందరికి తెలుసు గద్వాల లో చెల్లని రూపాయి కర్ణాటకలో ఎలా చెల్లుతుంద,మీతో పాటు బిజెపి లో చేరిన వారంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారనీ,.మీరు కూడా యూ టర్న్ తీసుకుంటే బాగుంటుందనీ,.అనవసరంగా బిజెపి లో చేరానని బాధపడొద్దు అని, కాంగ్రెస్ లోకి వస్తారంటే ఆహ్వానిస్తామనీ, గత 10 సంవత్సరాలలో బిజెపి ప్రజలకు ఉపయోగపడే ఒక్క పథకం కానీ ప్రాజెక్టు కానీ తెచ్చామని చెప్పండి రాబోయే రోజుల్లో వచ్చేది కాంగ్రెస్ పార్టీ అని వెంకటేష్ అన్నారు.