రాజన్న సిరిసిల్ల బ్యూరో. జూన్ 24. (జనంసాక్షి). ఏమయే ఏమయే తొమ్మిదో ప్యాకేజీ ఎమయే అంటూ కాంగ్రెస్ నాయకులు చేసిన నినాదాలతో గంభీరావుపేట మండలం నర్మల ఎగువ మానేరు ప్రాజెక్టు పరిసర ప్రాంతాలు దద్దరిల్లిపోయయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి పై కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం డిసిసి అధ్యక్షులు ఆది శ్రీనివాస్, కేకే మహేందర్ రెడ్డి ల ఆధ్వర్యంలో కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ తో పాటు నాయకులు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్ మండలం నర్మల ఎగువ మానేరు ను సందర్శించారు. కాలేశ్వరం తొమ్మిదో ప్యాకేజీ ద్వారా నర్మల ఎగువ మానేరు డ్యామ్ నింపుతామన్న మంత్రి కేటీఆర్ హామీ ఏమైంధంటూ ప్రశ్నిస్తూ డ్యామ్ వద్ద నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఏమాయే ఏమాయే తొమ్మిదో ప్యాకేజీ ఏమాయే అంటూ చేసిన నినాదాలతో డ్యాం పరిసర ప్రాంతాలు మర్మోగిపోయాయి. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ సిద్దిపేట స్థానికుడు కావడంతో సిరిసిల్ల నియోజకవర్గ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎండ్లు గడుస్తున్న తొమ్మిదో ప్యాకేజీ పనులు పూర్తి చేయకపోవడంపై మండిపడ్డారు. 10, 11 ,12 ప్యాకేజీ పనులను పూర్తి చేసుకొని సిద్దిపేట జిల్లాకు నీళ్లు తీసుకుపోయిన మంత్రి కేటీఆర్ కు సిరిసిల్ల ప్రజలు రైతుల ను మరోసారి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రెండేళ్ల క్రితం తొమ్మిదో ప్యాకేజీ పనులు పూర్తి చేయాలని ఆందోళన చేస్తే కరోనాకాలంలో కూడా అరెస్టులు చేసిన ప్రభుత్వం పనులు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. సొంత నియోజకవర్గానికి నీళ్లు అందించలేనీ కేటీఆర్ ధోరణిపై మండిపడ్డారు.ప్రభుత్వ వైఫల్యాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తించాలని కోరారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని బిఆర్ఎస్ ప్రభుత్వం పనులు పూర్తి చేయని పక్షంలో తామే పూర్తి చేస్తామని అన్నారు. డిసిసి అధ్యక్షులు ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా రైతులకు సాగునీరు అందించే ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వహించడాన్ని తప్పు పట్టారు. సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గల్లో కాలేశ్వరం తొమ్మిదవ ప్యాకేజీ పనులను తక్షణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమని రైతులు ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సహకారం చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో నాయకులు చీటీ ఉమేష్ రావు, ఆకునూరి బాలరాజు, సాగరం వెంకటస్వామి, సుర దేవరాజు, టోనీ, మునిగేల రాజు, భరత్ పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఏమయే ఏమయే తొమ్మిదో ప్యాకేజీ ఏమాయే… ఎగువ మానేరు వద్ద కాంగ్రెస్ నాయకులు ఆందోళన. ప్రభుత్వ నిర్లక్ష్యంపై భగ్గుమన్న కాంగ్రెస్ నేతలు.




