బచ్చన్నపేట జూన్ 24 (జనం సాక్షి) భారతదేశంలో సుస్థిర పాలన ఒక మోడీతోనే సాధ్యమైతుందని బిజెపి బచ్చన్నపేట మండల అధ్యక్షులు సద్ది సోమిరెడ్డి అన్నారు. శనివారంఇంటింటికి బిజెపి.. మహాజన సంపర్క్ అభియాన్ లో భాగంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 9 సంవత్సరాల లో సాధించిన విజయాలు ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరవేయాలని ఉద్దేశంతో ఈరోజు ప్రచారంలో భాగంగా పోచన్నపేట గ్రామంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను వివరించిన అనంతరం మాట్లాడుతూ.ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవినీతి వైఫల్యాలను కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చిన పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు. వెంటనే ఈ అవినీతి అరాచక ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి జూకంటి గణేష్,బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి గద్దరాజు, మండల నాయకులు గడ్డోజు రవి, జంజాల సురేష్, సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు.
మోదీ తోనే సుస్థిరపాలన బిజెపి బచ్చన్నపేట మండల అధ్యక్షుడు సద్ది సోమిరెడ్డి




