Thursday, 5 November 2026

ఏసిడి పేరిట వచ్చిన విద్యుత్ బిల్లులను వెంటనే రద్దు చేయాలి

 

బిల్లులు చూసి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు

అన్నింట చార్జీలు పెంచి ప్రజల రక్తం తాగుతుంది కేసీఆర్ ప్రభుత్వం

శంకరపపట్నం, జనంసాక్షి, జనవరి 21

గృహ విద్యుత్ వినియోగదారుల నుండి ముందస్తు వినియోగ డిపాజిట్ ( అడిషనల్ కన్సమ్షన్ డిపాజిట్ ) బిల్లుల పేరిట ప్రభుత్వం బలవంతంగా విద్యుత్ వినియోగదారుల నుండి బిల్లులు వసూళ్లు చేయడం పై శంకరపట్నం బిజెపి శ్రేణులు బగ్గుమన్నారు. బిజెపి కరీంనగర్ జిల్లా శాఖ పిలుపుమేరకు ఏ సి డి విద్యుత్ బిల్లులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శంకరపట్నం బిజెపి మండల అధ్యక్షులు ఏనుగుల అనిల్ ఆధ్వర్యంలో వరంగల్ -కరీంనగర్ హైవే పైన రాస్తారోకో చేయడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు మాడ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో బిజెపి శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని కెసిఆర్ ప్రభుత్వం సామాన్య మధ్యతరగతి ప్రజల రక్తం తాగుతుందని ఆయన మండిపడ్డారు. పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమం, అభివృద్ధి కొరకు కెసిఆర్ ప్రభుత్వం చారన ఖర్చు చేసి అక్రమంగా బారాన దండుకుంటుందని ఆయన దుయ్యబట్టారు. ముఖ్యంగా నేడు విద్యుత్ వినియోగదారుల విషయంలో వ్యవహరిస్తున్న తీరే ఇందుకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. వేళల్లో వచ్చిన ఏ సి డి బిల్లులను చూసి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారన్నారు. పంపిణీ సంస్థ వ్యవహరించడం దారుణం అన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు పలకల రాజిరెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు అంతం రాజిరెడ్డి జంగ జైపాల మండల ప్రధాన కార్యదర్శులు ఎల్కపల్లి సంపత్ దాసరపు నరేందర్ మండల ఉపాధ్యక్షులు సుదుగోని శ్రీనివాస్ అర్జున్ మండల కార్యదర్శులు దాసరి సంపత్ వడ్లకొండ రాజేందర్ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు మందాడి జగ్గారెడ్డి ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు గౌరవేణి శ్రీనివాస్ బీజేవైఎం మండల అధ్యక్షుడు బొడిగె నరేష్ ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు కనకం సాగర్ ఎస్టి మోర్చా మండల అధ్యక్షుడు బిజిలి సారయ్య,మండల సోషల్ మీడియా కన్వీనర్ చుక్కల శ్రీకాంత్, మహేందర్ రెడ్డి నూనె కొండల్ రెడ్డి జనగం ప్రణయ్ ఉమ్మెత్తల మండల్ నాయకులు ఇంద్రసేనారెడ్డి నల్ల రాజిరెడ్డి కోరం ఆదిరెడ్డి పైడిపల్లి సదానందం వివిధ గ్రామాల బూత్ అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.