బిజెపి నాయకులు ధర్నా రాస్తారోకో
వీణవంక , జనవరి 21 (జనంసాక్షి,)
వీణవంక గృహ విద్యుత్ వినియోగదారుల నుండి ముందస్తు వినియోగ డిపాజిట్ ఏసిడి బిల్లుల పేరిట ప్రభుత్వం బలవంతంగా విద్యుత్ వినియోగదారుల నుండి బిల్లులు వసూళ్లు చేయడం పై వీణవంక బిజెపి పార్టీ నాయకులు బగ్గుమన్నారు. ఈరోజు బిజెపి పార్టీ పిలుపుమేరకు ఏ సి డి విద్యుత్ బిల్లులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బిజెపి పార్టీ హుజురాబాద్ అసెంబ్లీ కన్వీనర్ మాడ గౌతమ్ రెడ్డి వీణవంక బిజెపి మండల అధ్యక్షులు ఆదిరెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ జమ్మికుంట ప్రధాన రహదారిపై ధర్నా రాస్తారోకో చేయడం జరిగింది. అనంతరం విద్యుత్ అధికారులకు వినతి పత్రం అందజేయడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బిజెపి పార్టీ మండల ఇన్చార్జ్ సమ్మిరెడ్డి ఆధ్వర్యంలో బిజెపి శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం సామాన్య మధ్యతరగతి పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి కొరకు కెసిఆర్ ప్రభుత్వం చారాన ఖర్చు చేసి అక్రమంగా బారాన దండుకుంటుందని ఆయన దుయ్యబట్టారు. ముఖ్యంగా నేడు విద్యుత్ వినియోగదారుల విషయంలో వ్యవహరిస్తున్న తీరే ఇందుకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. వెయ్యిలలో వచ్చిన ఏ సి డి బిల్లులను చూసి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారన్నారు. ప్రభుత్వం ఇలా వ్యవహరించడం దారుణం అన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ హుజురాబాద్ అసెంబ్లీ కన్వీనర్ మాడ గౌతంరెడ్డి మండల అధ్యక్షుడు ఆదిరెడ్డి జిల్లా కార్యదర్శి నరసింహ రాజు. కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సమ్మిరెడ్డి. ప్రజా ప్రతినిధులు పెద్ది మల్లారెడ్డి. ఎనుగంటి శ్రీనివాస్. సురేందర్ రెడ్డి. మోరె స్వామి. మారముళ్ళ కొమురయ్య. మోటం వెంకటేష్. సురేందర్ రెడ్డి బాబురావు.ఎండి అఖిల్. దాసారపు రాజు. తిరుపతి రెడ్డి తో పాటు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




