Thursday, 5 November 2026

108 పైలెట్లకు ట్రైనింగ్ సర్టిఫికెట్లు పంపిణీ

 

టేకులపల్లి, జనవరి 21( జనం సాక్షి ): 108 వాహన పైలట్లకు ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీస్ హైదరాబాద్ నుంచి వచ్చిన ఇంస్ట్రక్టర్ గజేందర్,అరుణ్ కుమార్,వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 108 పైలెట్లకు మెడికల్ ట్రైనింగ్ ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం లోని ఎం సి హెచ్ లో ఉమ్మడి జిల్లాల 108 ప్రోగ్రాం మేనేజర్ భూమా నాగేంద్ర ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్ ప్రధానం చేశారు.ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి 108 పైలెట్స్ కడుదుల వెంకట రామారావు, ఎల్. రమేష్ సర్టిఫికెట్స్ అందుకున్నారు. భద్రాద్రి ఈఎంఈ దుర్గాప్రసాద్,108 సిబ్బంది పాల్గొన్నారు.