ఏసీబీ వలలో ఆర్‌ అండ్‌ బీ ఎస్‌ఈ

గుంటూరు : గుంటూరు ఆర్‌ అండ్‌ బీ ఎస్‌ఈ (సూపిరింటెడెంట్‌) ఇంజినీర్‌ కె.వి.రాఘవేంద్రరావు నివాసంలో గురువారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో రాఘవేంద్రరావుతో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ డీఎస్పీ దేవానంద శాంతో ఆధ్వర్యంలో పది ప్రత్యేక బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఇప్పటివరకు ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.2కోట్ల విలువ చేసే ఆస్తులు గుర్తించినట్లు డీఎస్పీ తెలిపారు. రాజధాని ప్రాంతంలో ఏడెకరాల పొలంతో పాటు వజ్రాభరణాలు, నగదు గుర్తించినట్లు వెల్లడించారు.

తాజావార్తలు