Thursday, 5 November 2026

ఏసీ డి విద్యుత్తు బిల్లులపై భగ్గుమన్న భాజపా శ్రేణులు

 

◆◆◆◆ మానకొండూరులో విద్యుత్తు కార్యాలయం ముందు ధర్నా

,◆◆◆◆ సెక్షన్ అధికారికి వినతి పత్రం అందజేత

మానకొండూరు, అర్ సి, జనవరి 21( జనం సాక్షి)

గృహ విద్యుత్ వినియోగదారుల నుంచి ముందస్తు వినియోగ డిపాజిట్ బిల్లుల పేరిట ప్రభుత్వం బలవంతంగా అధిక మొత్తంలో బిల్లులు వసూలు చేయడం పై మానకొండూరులో భాజపా శ్రేణులుభగ్గుమన్నాయి. వెంటనే ప్రభుత్వం ఏసీడీ విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం మానకొండూరులోని విద్యుత్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం దోపిడి రాజ్యం, వద్దురా నాయన కేసీఆర్ పాలన అంటూ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. మానకొండూరు మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రాపాక ప్రవీణ్ ఆధ్వర్యంలో విద్యుత్తు ఏ సీడీ చార్జీలను రద్దుచేసి విద్యుత్ వినియోగదారులకు ఊరట కలిగించాలని మానకొండూరు విద్యుత్ సెక్షన్ అధికారి( ఏ ఈ ఈ) ఫఫీ అహమ్మద్ కు వినతి పత్రం అందించారు. భాజపా మానకొండూరు అసెంబ్లీ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి, మానకొండూరు నియోజకవర్గం నాయకులు గడ్డం నాగరాజు, భాజపా మండలాధ్యక్షులు రాపాక ప్రవీణ్ లు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏసీడీ విద్యుత్ బిల్లులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. అధిక మొత్తంలో విద్యుత్ బిల్లుల తో సామాన్య, మధ్యతరగతి వినియోగదారులపై భారం మోపి వారి నడ్డి విరుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మియాపురం లక్ష్మణాచారి, మండల ప్రధాన కార్యదర్శి సోన్నాకుల శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షులు కత్తి ప్రభాకర్ గౌడ్, బీజేవైఎం మండల అధ్యక్షులు భాషాబోయిన ప్రదీప్ యాదవ్, ఓబిసి మోర్చా మండల అధ్యక్షులు మార్కొండ రమేష్ పటేల్, కిసాన్ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి గాడిచర్ల భూమయ్య, నాయకులు ఊష కోయిల శ్రీనివాస్, ఎండి షకిల్,బొడ్డు సాయిలు,కత్తి రాకేష్ గౌడ్, భామండ్ల రాజు, మడ్డి రాకేష్ గౌడ్, బీరం రమేష్, కొండ్ర హరీష్, కొండ్ర వరప్రసాద్, అజయ్ అజయ్ పాల్గొన్నారు.