Saturday, 7 November 2026

ఏసెంసీ చైర్మన్ ఘోరవ్. ఫొటో : చైర్మన్ ను ముట్టడించిన విద్యార్థులు.

ఏసెంసీ చైర్మన్ ఘోరవ్.
ఫొటో : చైర్మన్ ను ముట్టడించిన విద్యార్థులు.
బెల్లంపల్లి, డిసెంబర్ 21, (జనంసాక్షి )
బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలం మైలారం హై స్కూల్ విద్యార్థులు బుధవారం స్కూల్ మేనేజ్మెంట్ చైర్మన్ తాండూరు భాస్కర్ ను ఘోరవ్ చేశారు. పాఠశాలలో మొత్తం 207 మంది విద్యార్థులు ఉండగా ఇందులో 100 మంది వరకు బాలికలు ఉన్నారు. మే నెలలో వేసవి సెలవులలో టాయిలెట్స్ నూతనంగా కడతామని చెప్పి పాత టాయిలెట్స్ మొత్తం జెసిబి తో తీసేసి కొత్త టాయిలెట్స్ కోసం ముగ్గు పోసి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదని,
స్కూల్స్ ప్రారంభం నాటికి మీకు టాయిలెట్స్ అందిస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా పనులు ప్రారంభించలేదని బాలికలు ఆగ్రహం వ్యక్తం చేసి నిరసన తెలిపారు. మరుగుదొడ్ల నిర్మాణ పనులు ఉపాధి హామీ కింద మంజూరు కావడంతో బిల్లులు సకాలంలో రావనే ఉద్దేశంతో పనులు చేపట్టడం లేదని బాలికలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలికలు ఆరు నుంచి పదవ తరగతి వరకు చదివే విద్యార్థులు. బాలికలు బయట ఎక్కడ కూడా వారు మూత్ర విసర్జనకు ఎలాంటి చోటు లేకుండా పాఠశాల చుట్టూ ఇళ్ళు ఉన్నాయని,
ఈ పరిస్థితులలో మంచి నీరు తాగితే మూత్రం వస్తుందని భయంతో నీరు కూడా త్రాగడం లేదని వారు వాపోయారు.
ఇలాంటి సమస్యతో ఆరోగ్యాలు చెడిపోతున్నాయని, తమ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వెంటనే మరుగుదొడ్లు కట్టించాలని చైర్మన్ ముందు బైఠాయించారు మరుగుదొడ్లు కట్టించేవరకు నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. పనులు ప్రారంభించే వరకు గ్రామపంచాయతీ కార్యాలయం ముందు ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని బాలికలు తెలిపారు.