Tuesday, 3 November 2026

ఏ.ఐ.ఎస్.బి 73వ వార్షికోత్సవాలను జయప్రదం చేయండి

జనం సాక్షి సైదాపూర్ అఖిల భారత విద్యార్థి బ్లాక్ ఏ.ఐ.ఎస్.బి 73 వ వార్షికోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ సైదాపూర్ మండల కేంద్రములోని సోమారం మోడల్ స్కూల్ ఆవరణలో సైదాపూర్ మండల AISB నాయకులు బోళ్ల నవనీత్ ఆధ్వర్యంలో జరగగా ఈ కార్యక్రమానికి AISB రాష్ట్ర కార్యదర్శి మొలుగూరి హరికృష్ణ హాజరయి మాట్లాడుతూ AISB 1951 జూన్ 25 న బెంగాల్ రాష్ట్రంలో ఏర్పడి నేతాజీ ఆలోచన విధానం తో సోషలిజం ,శాంతి, అభ్యుదయం అనే నినాదాలతో గత 72 సంవత్సరాలుగా భారత దేశంలో విద్యార్థుల్లో జాతీయ భావాలను పెంపొందిస్తూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ కలలు కన్న భారతదేశ నిర్మాణం కై ఉద్యమిస్తు విద్యారంగ సమస్యలపై పోరాటాలు కొనసాగిస్తుంది అని మొలుగూరి హరికృష్ణ అన్నారు ,రాష్ట్ర వ్యాప్తంగా ఏ.ఐ.ఎస్.బి శ్రేణులు జూన్ 25 న 73 వ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు అదేవిధంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ విద్యారంగ సమస్యలకు నిలయంగా మారాయన్నారు ప్రభూత్వ విద్యాసంస్థలను కాపాడుకునే భాధ్యత పూర్తిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుందని, కేంద్ర రాష్ట్ర ప్రభూత్వాలు విద్యారంగ సమస్యలను పరిష్కరించకపోతే AISB విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలను చేపడుతామణి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో AISB నాయకులు కనకం అజయ్,శ్రీమాన్, సుమన్, మనీష్, అరవింద్, సాయి, అఖిల్, శ్రీకాంత్,శ్రీనివాస్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు