Tuesday, 3 November 2026

జోగులాంబ గద్వాల జిల్లాకు బీసీ డిగ్రీ గురుకుల కళాశాలను ప్రకటించడం చాలా సంతోషకరం

గద్వాల నడిగడ్డ, జూన్ 24 (జనం సాక్షి);జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీ పీజీ కళాశాలలో శనివారము సీఎం కేసీఆర్ కి బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేయడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య మాట్లాడుతూ దేశంలో బీసీల సమగ్ర విద్యాభివృద్ధికి కేరాఫ్ సీఎం కేసీఆర్ అని అన్నారు.రాష్ట్రంలో మరో 17 గురుకుల డిగ్రీ కళాశాలలను ప్రకటించి బీసీల పైన ఉన్న గొప్పతనం మరొకసారి చాటిన సీఎం కేసీఆర్ అని అన్నారు. రాష్ట్రంలో మొత్తం బిసి డిగ్రీ గురుకుల కాలేజీలు 33 కు చేరుకున్నాయి అని అన్నారు.కెసిఆర్ సంకల్పం వల్లనే గురుకులాలు 19 నుండి 327 పెరిగిందనీ,వెనకబడిన వర్గాల జీవితాలలో విద్యా ద్వారానే సమూల మార్పులు వస్తాయని అన్నారు. దాదాపు మొత్తం బీసీ గురుకులలో 1,82,440 విద్యార్థులు ఉచితంగా నాన్నమైన విద్య అందుతుందని అన్నారు.ఇప్పటికే రాష్ట్రంలో అంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1000 కి పైగా గురుకులలాలను తీసుకొచ్చినటువంటి ఘనత సీఎం కేసీఆర్ ది అని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు విద్య కార్పొరేట్ స్థాయిలో అందించాలని ఒక సంకల్పంతో ఈరోజు విద్యాభివృద్ధికి బంగారు బాట లేస్తున్నటువంటి ముఖ్యమంత్రి కి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు అన్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు విద్యార్థులు కిరణ్, ప్రవీణ్, చంద్రబాబు, మార్కండేయ, మద్దిలేటి, లక్ష్మి, సంధ్య, స్వాతి, శిరీష, విజయ్, మౌనిక తదితరులు పాల్గొన్నారు.