నిర్మల్ బ్యూరో, జూన్24,జనంసాక్షి,, రాష్ట్రం లొ అధికారం లోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ ఏ అని ఉద్యమ నేత కాంగ్రెస్ నాయకుల శ్రీహరి రావు అన్నారు. శనివారం నిర్మల్ జిల్లా కేంద్రనికి చెందిన OBC జిల్లా కార్యదర్శి శివకుమార్ BJP ఆ పార్టీ కి రాజీనామా చేసి శ్రీహరి రావు ఆధ్వర్యంలో అతని అనుచరులతో కలిసి కాంగ్రెస్ లొ చేరారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ రాష్ట్రం లొ అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని వెళ్లే పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలొ అధికారం లోకి రావడం కాయం అని ధీమా వ్యక్తం చేశారు. BRS, BJP రెండు ఒకటే అని ఆ పార్టీ లను ప్రజలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లొ మాజీ కౌన్సిలర్ మాజీ మునిసిపల్ వైస్ చైర్మన్ వాజీద్ అహ్మద్ ఖాన్,పోడెల్లి గణేష్, గాజుల రవి కుమార్, గంగోని బురాజ్,తదితరులు పాల్గొన్నారు.
భాజాపా ఓబిసి నేత శివకుమార్ కాంగ్రెస్ లో చేరిక




