Wednesday, 4 November 2026

ఐఎన్టియుసి కృషితో జేబీసీసీఐ లో చారిత్రాత్మక వేతన ఒప్పందం.కార్మికులకు 19% ఎంజిబి అన్ని రకాల ఆలవేన్స్ లలో 25% పెరుగుదల. ఐఎన్టియుసి జాతీయ కార్యదర్శి ,- వేజ్ బోర్డు మెంబర్ , – జనక్ ప్రసాద్

(ప్రత్యేక ప్రతినిధి / జనం సాక్షి )దేశ వ్యాప్తంగా 3 లక్షలకు పైగా ఉన్న బొగ్గు గని కార్మికులకు వేతన సవరణలో కార్మికుల ప్రయోజనాలను కాపాడి మెరుగైన వేతన సవరణ జరిగేలా చూడటంలో జాతీయ కార్మిక ఐఎన్టీయూసీ చురుకైన పాత్ర పోషించింది.
ముఖ్యంగా ఐఎన్ టీయూసీ అధ్యక్షులు డాక్టర్ జి.సంజీవ రెడ్డి క్రియాశీల పాత్ర పోషించడం వల్ల దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థలలో లేని విధంగా బొగ్గు సంస్థల్లో 19 శాతం మినిమమ్ గ్యారెంటీ బెనిఫిట్ను లభించింది.
అదే కాకుండా రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ గురించి మరియు కాంట్రాక్ట్ కార్మికుల హై పవర్ కమిటీ వేతనాల గురించి మాట్లాడగా త్వరలో నిర్ణయం తీసుకుంటారని తెలిపారు .
కార్మికులకు అందే అండర్ గ్రౌండ్ అలవెన్స్, ఎల్టీసీ తదితర అనేక అలవెన్సులపై 25 శాతం పెంపుదల సాధ్యమైంది. మరీ ముఖ్యంగా కార్మికులకు 5 రోజుల పితృత్వ సెలవులు లభించాయి.మొదటి నుంచీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తీవ్రంగా ప్రతిఘటించడమే కాకుండా చాలా వరకు కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయించడంలో ఐఎన్టీయూసీ పోషించి పాత్ర వల్ల బొగ్గు గని కార్మికుల ప్రయోజనాలను కాపాడగలిగాం.ప్రస్తుతం జరిగిన వేతన ఒప్పందం వల్ల డెయిలీ రేటెడ్ ఉద్యోగులకు దాదాపు 2.70 లక్షల నుంచి 3.16 లక్షల వరకు ఎరియర్స్ లభించ నున్నాయి. మంథిలీ రేటెడ్ ఉద్యోగులకు కనిష్టంగా 27 లక్షల నుంచి గరిష్టంగా 491 లక్షల వరకు ఎరియర్స్ చెల్లింపులు జరగనున్నాయి.ఎక్స్కవేషన్ విభాగం ఉద్యోగులకు కనిష్టంగా 288 లక్షల నుంచి గ 2 లక్షల వరకు ఎరియర్స్ లభిస్తాయి. క్లరికల్ కేటగిరిలో ఉద్యోగులకు 1.87 లక్షల నుంచి 2.28 లక్షల వరకు గ రిష్టంగా ఎరియర్స్ లభిస్తాయి.
సింగరేణి ఉద్యోగులకు 11వ వేజ్ బోర్డు ఒప్పందంతో వేతనాల్లో పెరుగుదల, లభించనున్న ఎరియర్స్పై ఐఎన్టీయూసీ రూపొందించిన ప్రత్యేక వేతన పెరుగుదల పట్టికను పొందుపరచడం జరిగింది.
ఇది బొగ్గు గని కార్మికుల సమష్టి విజయం అన్నారు జనక్ ప్రసాద్…..