వీణవంక 23 (జనం సాక్షి) వీణవంక భారత రాజ్యాంగ ధర్మాన్ని దేశంలో ఉన్న పౌరులందరికీ ఉచితంగా అందించాలని వీణవంక మండల కేంద్రములో ధర్మ సమాజ్ పార్టీ తరుపున ప్రధాన రహదారి జమ్మికుంట కరీంనగర్ వీణవంకలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 400 మండలాల్లో 8-05-2023 రోజున తహశీల్దార్లకు రిప్రేజెంటేషన్ ఇవ్వడం జరిగిందనీ,పై విషయమై ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేని కారణంగా మంగళవారం రెండవ రిప్రజెంటెషన్ ఇవ్వడం జరిగిందనీ అన్నారు.. ఈ దేశాన్ని నడిపిస్తున్నది భారత రాజ్యాంగం.అలాంటి గ్రంథం పట్ల నూటికి 90% శాతం ప్రజలకు అవగాహన లేకనే పార్లమెంటరీ,ప్రజాస్వామ్యం విఫలమైపోతుంది. దీని వల్ల ప్రజల జీవితం అన్ని రంగాలల్లో అభివృధి సాధించలేక అధోగతి పాలవుతున్నారు.. ఈ కార్య క్రమంలో ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీకాంత్, డి.ఎస్.పి మండల ప్రచార కమిటీ సభ్యులు సదానందం, రాజేంద్ర ప్రసాద్ రాకేష్,కిషోర్,రాజు,పృధ్వీరాజ్,అనిల్,సురేష్, అశోక్, సతీష్,తదితరులు పాల్గొన్నారు..




