Thursday, 5 November 2026

ఐఎఫ్టియు ఆధ్వర్యంలో విజయవంతంగా ముగిసిన క్రీడలు

ఐఎఫ్టియు ఆధ్వర్యంలో విజయవంతంగా ముగిసిన క్రీడలు

టేకులపల్లి,జనవరి 13 (జనం సాక్షి): సంక్రాంతి పండుగను పురస్కరించుకుని భారత కార్మిక సంఘాల సమాక్య (ఐ ఎఫ్ టి యు )ఆధ్వర్యంలో కుంటల్ల,బద్దుతండ గ్రామపంచాయతీ స్థాయి ముగ్గులు, తాడు గుంజుడు క్రీడల్లో యువకులు, మహిళలు, పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని క్రీడలను ఆనందోత్సవాలు మధ్య శుక్రవారం విజయవంతంగా ముగిశాయి. నిర్వహించిన క్రీడలలో ముగ్గులలో ప్రధమ,ద్వితీయ,తృతీయ బహుమతులను శిరీష, సౌందర్య, శ్రీ వెన్నెల గెలుచుకున్నారు. తాడు గుంజుడు పోటీలో ప్రధమ బహుమతి కుంటల్ల, ద్వితీయ బహుమతి నందియా తండా, తృతీయ బహుమతి తుమ్మల చెలక గెలుచుకున్నారు. ఈ బహుమతులను ఎంపీటీసీ వూకె రామకృష్ణ, కుంటల సర్పంచ్ మోకాళ్ళ రమాదేవి, ఐ ఎఫ్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి డి ప్రసాద్ ల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహద పడతాయని అన్నారు. శరీర డారుణ్యాన్ని పెంచుతాయని అన్నారు . సోదర భావంతో కలిసి మెలిసి ఉండే విధంగా దోహదపడతాయని అన్నారు .ఈ కార్యక్రమంలో బద్దుతండ మాజీ ఎంపీటీసీ భానోతు పంతులు, మాజీ సర్పంచ్ భూక్య కీర్యా, నిర్వహకులు ధనసరి పవన్,మోకాళ్ళ రామకృష్ణ, మోకాళ్ళ కళ్యాణ్,నోముల పరశురాములు, రాజేష్, ప్రవీణు, సిపిఐ ఎంఎల్ (ప్రజాపందా,) మండల నాయకులు భూక్య పంతులు, బాదావత్ సాములు, భూక్య లాలియా తదితరులు పాల్గొన్నారు.