Wednesday, 4 November 2026

రోడ్డు ప్రమాదాల నివారణకు రిపోర్ట్ తయారు చేసిన డిఎస్పీ

 

 

 

 

 

 

జుక్కల్, ఎప్రిల్ 19,(జనంసాక్షి),కామారెడ్డి జిల్లా బాన్స్ వాడ డిఎస్పీ జగన్నాతరెడ్డి అధ్వర్యంలో బిచ్కుంద సీఐ కృష్ణ, మద్నూర్ ఎస్సై కృష్ణారెడ్డిలు కలిసి బుధవారం రోడ్డు ప్రమాదాల నివారణకు రిపోర్ట్ తయారు చేశారు.కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లోని మద్నూర్ మండలం మెనూర్ గ్రామం జాతీయ రహదారి(161) పై రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని గుర్తించారు. ఇక్కడ ప్రమాదాలు జరగడానికి కారణాలు తెలుసుకున్నారు.రోడ్డు నిర్మాణం లో ఇంజనీరింగ్ లోపాలు గుర్తించి సమగ్రంగా ఒక రిపోర్ట్ తయారు చేశారు.ఈ రిపోర్ట్ ను నేషనల్ హైవే అథారిటీ కి, ఆర్ అండ్ బి అధికారులకు అందజేసి ప్రమాదాల నివారణకు తగు చర్యలు చేపట్టాలని కోరుతామని తెలిపారు.