Thursday, 5 November 2026

ఐకెపి, వివోఏల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని ధర్నా

 

 

 

 

మిర్యాలగూడ, జనం సాక్షి దీర్ఘ కాలికంగా పెండింగ్ లో ఉన్న ఐకెపి వివోఏ ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిర్వదిక సమ్మెలో భాగంగా సోమవారం మిర్యాలగూడ మండలంలోని ఎంపీపీ కార్యాల ఆవరణలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మి, చంద్రకళ, బానోతు జాను, చంద్రశేఖర్, సుహాసినిలు మాట్లాడుతూ ఐకెపి వి ఏ వి ఓ ఏ లను ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు కనీస వేతనం నెలకు ఇరవై ఆరు వేలు చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. పది లక్షల సాధారణ భీమా ఆరోగ్య భీమా సౌకర్యం కల్పించాలని ఐడీ కార్డు ఇవ్వాలని తదితర డిమాండ్ల సాధన కోసం ఉద్యమం చేపట్టినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీపార్వతి, నాగలక్ష్మి, రాంబాబు, శంకర్, ప్రావిన్స్, సావిత్రి, తదితరులు పాల్గొన్నారు.