Thursday, 5 November 2026

సలాబత్ పూర్ శివార్ లో చెక్ పోస్ట్ ఏర్పాటు

 

 

 

 

 

 

జుక్కల్, ఎప్రిల్ 17, (జనంసాక్షి),కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లోని మద్నూర్ మండలం సలాబత్ పూర్ శివార్ లో మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో సోమవారం అదికారులు చెక్ పోస్ట్ ను ఏర్పాటుచేశారు.ఈ సంద ర్బంగా మద్నూర్ ఎస్సై కృష్ణారెడ్డి మాట్లాడుతు కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ చెక్ పోస్ట్ ప్రారంబించినట్లు తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్రలనుండి వరి ధాన్యం అక్రమంగా తెలంగాణలో చొరబడకుండ ఈ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.ఈ చెక్ పోస్ట్ లో రెవెన్యూ, పోలీస్ ,వ్యవసాయ శాఖ, రవాణా శాఖ అధికారులు విధులు నిర్వర్తిస్తారని ఆయన తెలిపారు.