Wednesday, 4 November 2026

వావిలాల_గడ్డపోతారం గ్రామాలలో సార్లు….ఇదేం భూసేకరణ

 

 

 

 

 

 

 

జిన్నారం ఏప్రిల్ 19(జనంసాక్షి) సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలంలోని వావిలాల నుండి గడ్డపోతారం వెళ్లే దారికి ఆనుకొని ఉన్న అసైన్డ్ భూములు,లావానీ ల్యాండ్లు, భూదాన్ ల్యాండ్,శిఖము ల్యాండ్లపై ప్రైవేట్ మరియు భూభక సూరులు కొందరు కన్నేశారు!!! కొందరు ప్రజాప్రతినిధులు ప్రైవేట్ పరిశ్రమతో ఒప్పందం చేసుకొని రైతులకు నచ్చజెప్పి వారి నుండి భూమి తీసుకున్నారు నిజానికి ఇది నిబంధనలకు విరుద్ధం; రైతుల నుండి భూమిని సేకరించి వారికి పరిహారం అందిస్తుంది అనంతరం భూమిని పరిశ్రమకు అప్పగిస్తుంది కానీ ఇక్కడ అలాంటిది ఏమి జరగటం లేదు! ఇంకో విషయం ఏమనగా హెచ్.ఎం.డి.ఏ అనుమతులు పొందడానికి బొల్లారం మున్సిపల్ కార్యాలయం నుండి ఏ అనుమతులు లేకున్నా కేవలం స్థానిక తాసిల్దార్నే ఏవన్ గా సూచించి, అతను ఇచ్చిన నిబంధనాలని హెచ్ఎండిఏ నే చేసుకొని ప్రైవేట్ వ్యక్తులకు పర్మిషన్ ఇస్తున్నారు, కావున ఈ యొక్క బాధ్యత పూర్తిగా స్థానిక తహసీల్దార్దే అనుకోవటంలో అతిశయోక్తి లేదు అనడం గమనార్హం.