మర్పల్లి జూలై 07 (జనం సాక్షి) రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పడుతుందని అని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శుక్ర వారం మండల కేంద్రంలో ని ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మర్పల్లి, తిమ్మాపూర్, పంచలింగాలు గ్రామాల బిఆర్ఎస్, బిజెపి, టిడిపి ల నుండి 150 మంది యువకులు మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. వారికి పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీమంత్రి ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన వెంటనే రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు. 4000/- ఆసరా పింఛన్, 500/- ఒక గ్యాస్ సిలిండర్ ఇస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రవీందర్ మండల పార్టీ అధ్యక్షుడు, కృష్ణారెడ్డి పార్టీ బ్లాక్ 2 అధ్యక్షుడు, ఎంఎస్ సలీం, చామల రఘుపతి రెడ్డి,
శంకరయ్య గౌడ్, గణేష్, శేఖర్ గుప్తా, కలిముద్దీన్, సలీం, రాములు, కుమ్మరి సర్వేష్, తులసీదాస్, రఫీ, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బిఆర్ఎస్, బిజెపి, టిడిపి నుండి 150 మంది యువకులు కాంగ్రెస్ లో చేరిక – మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ సమక్షంలో




