– లొంగలేదని సీబీఐకేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు
– కేసుల నుంచి బయటపడేందుకే జగన్ బీజేపీ ముందు సాగిలపడ్డాడు
– అవిశ్వాసం తర్వాత భాజపా గ్రాఫ్ పడిపోయింది
– ప్రొద్దుటూరు ధర్మ పోరాట దీక్షలో ఎంపీ సీఎం రమేశ్
కడప, అక్టోబర్30(జనంసాక్షి): కేంద్రంపై అవిశ్వాసం పెట్టిన తర్వాత దేశంలో భాజపా గ్రాఫ్ పడిపోయిందని తెదేపా ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. అవిశ్వాసంపై ఏన్డీయే పక్షాలు మినహా మిగతా పార్టీలన్నీ తెదేపాకు
అండగా నిలబడ్డాయని వివరించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగిన ధర్మదీక్ష పోరాట సభలో ఆయన ప్రసంగించారు. తనను ఐటీ దాడులతో భయపెట్టాలని బీజేపీ నేతలు చూశారని, ఏవిూ చేయలేకపోయారని అన్నారు. అందుకే సీబీఐ కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నారని రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రత్యేక¬దా ఇస్తామని భాజపా చాలా రోజుల పాటు చెప్పినందునే నాలుగేళ్లపాటు ఎన్డీయేలో ఉన్నామని అన్నారు. కేసులకు భయపడి వైకాపా అధ్యక్షుడు జగన్.. భాజపాకు సాగిలపడ్డారని ఆయన విమర్శించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి, ప్రధాని మోదీ ద్రోహానికి మధ్య పోరాటం జరుగుతోందన్నారు. ఏపీకి ప్రత్యేక¬దా కావాలని అడిగింది భాజపా నేతలు కాదా? అని సీఎం రమేశ్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయకుండానే పోలవరం మండలాలను ఏపీలో విలీనం చేసేందుకు సీఎం కృషి చేశారన్నారు. చంద్రబాబు ఖ్యాతి పెరిగితే రాజకీయంగా ప్రధాని మోదీకి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని, చంద్రబాబుకు దేశవ్యాప్తంగా క్రెడిబులిటీ ఉన్నందునే ఆయన్ను అణిచివేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో తెదేపా సహకారం లేకపోయినా కేసులకు భయపడిన జగన్ తమకు అండగా ఉంటారని భాజపా భావించిందన్నారు. చంద్రబాబును ఎదుర్కోవడం కష్టమని భావించే రాష్ట్రంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని సీఎం రమేశ్ ఆరోపించారు. పాకిస్థాన్లో జరిగే మిలిటెంట్ దాడులతోనూ తనకు సంబంధాలు అంటగట్టినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదన్నారు. తనను దేశ ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని సీఎం రమేశ్ దుయ్యబట్టారు.




