Wednesday, 4 November 2026

ఐడిఏ బొల్లారంలో బస్సుల కోసం విద్యార్థుల రాస్తారోకో

జిన్నారం జులై 7(జనంసాక్షి)సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలం ఐడిఏ బొల్లారం మున్సిపాలిటీలో పాఠశాలలకు సమయానికి బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతూ బొల్లారం ప్రధాన రహదారిపై ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు శుక్రవారం ధర్నా రాస్తారోకో నిర్వహించారు!!! సమయానికి బస్సులు రాకపోవడంతో పాఠశాలలకు వెళ్ళలేకపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు! ఆర్టీసీ అధికారులకు విన్నపించిన స్పందించడం లేదని చెప్పారు. ఇకనైనా సమయానికి బస్సులు నడిపిస్తున్నామని అధికారులు విద్యార్థులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.