Wednesday, 4 November 2026

డిప్యూటీ తహశీల్దార్ కి వీడ్కోలు సన్మానం

 

 

 

బాషీరాబాద్ మండలం తహశీల్దార్ కార్యాలయంలో శుక్రవారం రోజున డిప్యూటీ తహశీల్దార్ గా రెండున్నర సంవత్సరాలు విధులు నిర్వహించి జూన్ 17వ తేదిన వికారాబాద్ మండల తహశీల్దార్ కార్యాలయనికి ఎలక్షన్ డ్యూటీ పరంగా బదిలీపై వెళ్లిన వీరేష్ బాబుకు ఘనంగా తహశీల్దార్ ఎన్.వెంకటస్వామి చేతుల మీదుగా వీడ్కోలు సన్మానం తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నూతన డిప్యూటీ తహశీల్దార్ వెంకటేష్, సీనియర్ అసిస్టెంట్ వెంకటేష్, ఆర్.ఐ రాకేష్,కంప్యూటర్ సెక్షన్ ఆఫీసర్ అరుణ్, వీఆర్ఏలు,తహశీల్దార్ కార్యాలయం సిబ్బంది,ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.