బ్రిస్బేన్: బ్రిస్బేన్ వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన యూఏఈ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 278 పరుగులు చేసింది. యూఏఈ బ్యాట్స్‌మెన్లలో షాహిమాన్ అన్వర్ ఐర్లాండ్ బౌలర్లను విజయవంతంగా ఎదుర్కొంటూ సెంచరీని పూర్తిచేశాడు. వ్యక్తిగత స్కోర్ 106 (10 ఫోర్లు, ఒక సిక్స్) పరుగుల వద్ద ఉండగా సోరేసన్ బౌలింగ్‌లో విల్సన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అదేవిధంగా అంజద్ అలీ-45, అంజద్ జావేద్- 42, ఖుర్రమ్‌ఖాన్- 36 పరుగులను అత్యధికంగా చేశారు. ఐర్లాండ్ బౌలర్లలో సొరెన్‌సన్, అలెక్స్ కుసాక్, స్టిర్లింగ్, కెవెన్ ఓబ్రియిన్ తలో రెండు వికెట్లు తీయగా డాక్‌రెల్ ఒక వికెట్‌ను పడగొట్టాడు. ఐర్లాండ్ విజయలక్ష్యం 279 పరుగులు.




