బోనకల్, మార్చి 25 (జనంసాక్షి):మధిర ప్రాజెక్టు పరిధిలోని ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణ పక్వాడా కార్యక్రమంలో భాగంగా శనివారం చిరునోముల, జానకిపురం ఉన్నత పాఠశాలలోని కిశోర బాలికలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీడీపీఓ కమల ప్రియ మాట్లాడుతూ అధిక పోషక విలువలు గల మిల్లెట్ల పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి వాటిని వాడుట వలన కలిగే ప్రయోజనాలను వివరించారు .ఈనెల 20 నుండి ఏప్రిల్’ 3 వరకు అంగన్వాడి స్థాయి, గ్రామ స్థాయి, ప్రాజెక్ట్ స్థాయిలో నిర్వహించనున్న పోషణ్ పక్వాడ కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఉన్నత పాఠశాలల్లో, అలాగే అంగన్వాడి కేంద్రాలలో పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ రమాదేవి మాట్లాడుతూ మిల్లెట్స్ ను ప్రోత్సహించటం, మిల్లెట్స్ ప్రచారం అంశాలపై పోషణ్ పఖ్వాడ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. పాఠశాలల్లోని కిశోర బాలికలకు స్థానికంగా లభించే మినుములు, మిల్లెట్స్ లో ఉండే పోషక విలువలను గూర్చి వివరించారు. పోషణ్ పఖ్వాడలో మిల్లెట్స్ రకాలు, ఆహారం యొక్క ప్రాముక్యత వైవిధ్యం పై అవగాహన కల్పించారు .రక్తహీనత, ఐరన్, విటమిన్-సి లోపం ఏర్పడకుండా ఉండేందుకు అవి అధికముగా ఉండే ఆహారం, మిల్లెట్స్ పై అవగాహనా కల్పించారు. పాఠశాలలోనీ కిశోర బాలికలకు రక్త పరీక్షలు, హెచ్బి టెస్టులు నిర్వహించి తగు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ పోషణ్ పక్వాడ కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీడీపీఓ కమల ప్రియ ,సూపర్వైజర్ రమాదేవి, ఎంపీటీసీ హైమావతి , పలువురు ప్రజా ప్రతినిధులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది , ఏఎన్ఎం వాణి ,అంగన్వాడీ టీచర్లు నాగరత్నం, వరలక్ష్మి, జ్యోతి సునీత ,ఆశా కార్యకర్తలు పలువురు వార్డు మెంబర్లు, తదితరులు పాల్గొన్నారు.
ఐసిడిఎస్ ఆధ్వర్యంలో “పోషణ్ పక్వాడ” ఐసిడిఎస్ ఆధ్వర్యంలో “పోషణ్ పక్వాడ”




