Sunday, 8 November 2026

ఐ ఎన్ టి యు సీ పై కీలక ప్రకటన.

ఐ ఎన్ టి యు సీ పై కీలక ప్రకటన……

ఆల్ ఇండియా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ శని వారం కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఐ ఎన్ టి యు సీ మీద కీలక ప్రకటన చేశారు..

 

ఐ ఎన్ టి యుసి లో ఏర్పడ్డ అంతర్గత కలహాల దృష్ట్యా జాతీయ అధ్యక్షులు మళ్లీకార్జున్ ఖర్గే మరియు జాతీయ నాయకులు దిగ్విజయ్ సింగ్ లతో టూ కమిటీ వేసి విచారణ చేయగా
ఐ ఎన్ టి యు సీ కి ఉన్న అన్ని అనుబంధ కార్మిక సంఘాలను పరీక్షించి సంజీవ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్న ఐ ఎన్ టి యు సీ నే కాంగ్రెస్ కి అనుబంధ ఐ ఎన్ టి యుసి గా గుర్తించారు .
తదుపరి రెండు గ్రూపు ల మధ్య ఉన్న వైరం మరియు కోర్టు లో అన్ని పెండింగ్ కేసులను త్వరలో విత్ డ్రా చేసుకొని ఎన్నికలకు సిద్దం కావాలని సూచించారు. దీనికి సంబందిచిన వ్యవహారాలను పర్యవేక్షించడానికి ఒక కమిటీ ను కూడా నియమించారు. దీని ఫలితంగా కోల్ ఇండియా స్థాయి జేబీసీసీఐ వేతన ఒప్పందం లో ఐ ఎన్ టి యుసి చోటు దక్కే అవకాశం ఉంది.

ఐ ఎన్ టి యు సీ ఆల్ ఇండియా సెక్రెటరీ జనక్ ప్రసాద్ సంజీవ రెడ్డి ఐఎన్టి యుసి నే అసలైన ఐఎన్ టి యు సీ గా గుర్తించినందుకు గాను సోనియా గాంధీ గారికి మరియు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే మరియు దిగ్విజయ్ సింగ్ లకు కృతజ్ఞతలు తెలిపారు .

ఇట్లు
జనక్ ప్రసాద్
సెక్రెటరీ ఆల్ ఇండియా -ఐఎన్టియు సీ
సెక్రెటరీ జనరల్
సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్