Sunday, 8 November 2026

డా. బి.ఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు అందుకున్న తెలంగాణ దండోరా నాయకులకు ఘన సన్మానం.

డా. బి.ఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు అందుకున్న తెలంగాణ దండోరా నాయకులకు ఘన సన్మానం.
-అవార్డు గ్రహీతలపై మరింత బాధ్యత పెరిగింది.
-తెలంగాణ దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు మీసాల రాము మాదిగ.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,డిసెంబర్24(జనంసాక్షి):

ఇటీవల హైదరాబాద్ లో బహుజన సాహిత్య అకాడమీ ఆద్వర్యంలో అంబేద్కర్ నేషనల్ అవార్డులను అందుకున్న తెలంగాణ దండోరా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్మూరి రాములు మాదిగ, తెలంగాణ దండోరా నాగర్ కర్నూల్ పార్లమెంటు ఇంచార్జీ మంతటి గోపి మాదిగ లను శనివారం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో ని తెలంగాణ దండోరా తాలూక కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు బోల్లె విష్ణు మాదిగ ఆధ్వర్యంలో శాలువాలతో, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.
ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు మీసాల రాము మాదిగ మాట్లాడుతూ దళితుల సమస్యల పైన నిరంతరం పోరాటం చేస్తూ ఎక్కడ అన్యాయం జరిగినా,న్యాయం జరిగేంతవరకు పోరాటం చేసి,దళిత బహుజనుల పక్షాన పోరాటం చేస్తున్నందుకు, బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్ల రాధకృష్ణ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం జరిగిందని తెలిపారు.
అంబేద్కర్ నేషనల్ అవార్డు రావడం పట్ల తెలంగాణ దండోరా జిల్లా కమిటి, తాలుకా కమిటి ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరిగిందని, అవార్డు గ్రహీతలపై మరింత బాధ్యత పెరిగిందని అన్నారు.అనంతరం అవార్డు గ్రహితలైన కల్మూరి రాములు మాదిగ, మంతటి గోపి మాదిగలు మాట్లాడుతూ ఈ అవార్డు రావడానికి కృషిచేసిన తెలంగాణ దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు మీసాల రాము మాదిగ, బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు అని తెలిపారు. అంబేద్కర్ జాతీయ అవార్డు రావడం పట్ల మాపై మరింత బాధ్యత పెరిగిందని, సంఘం కోసం, సమాజం కోసం, కృషి చేస్తామని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో
తెలంగాణ దండోరా కొల్లాపూర్ తాలూక ప్రధాన కార్యదర్శి రాజగోపాల్ మాదిగ, కొల్లాపూర్ మండల అధ్యక్షులు మల్లెల కురుమయ్య మాదిగ, జానపద కళాకారుడు పూసల వెంకటేష్, గడ్డల యాదగిరి,శంకర్, రవికుమార్,డి. కురుమయ్య, రజనీకాంత్, తదితరులు పాల్గొన్నారు.