Sunday, 8 November 2026

చెరువులో మృతదేహం లభ్యం

చెరువులో మృతదేహం లభ్యం
చెరువులో మృతదేహం సంఘటన అన్నాసాగర్ చెరువు వద్ద కొండపల్లి స్వాతి (29) మెదక్ వైపు నుంచి వచ్చిన బస్సులో గ్రామ బస్టాప్ వద్ద దిగింది. పక్కనే ఉన్న కల్లు దుకాణంలో కల్లు సేవించి, బాలుడిని అక్కడే వదిలేసి సమీపంలోని చెరువు వద్దకు వెళ్లి దూకింది. కొద్దిసేపటికి చుట్టుపక్కల వారు గమనించి, గ్రామ వీఆర్ఏలకు తెలపడంతో వారు వచ్చి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతురాలు జోగిపేటలోని మొండి గుట్ట కాలనీకి చెందిన ఈమెను మెదక్ లోని గాంధీ నగర్ ప్రాంతానికి చెందిన రాజుతో పది సంవత్సరాల క్రితం వివాహం అయినట్లు తెలిపారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాలుడు ఉన్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని ఎస్ఐ తెలిపారు. మృతురాలి తమ్ముడు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వాసుపత్రి తరలించినట్లు ఆయన తెలిపారు.