Wednesday, 4 November 2026

ఒకే హాస్టల్లో రెండు రకాల భోజనాలుకూలిన కోడిగుడ్లు గుడ్లుఈ విషయాలు బయట పెడితే విద్యార్థిలను బెదిరిస్తున్న ఉపాధ్యాయురాలు

 

 

 

 

 

 

 

 

బషీరాబాద్ ఏప్రిల్ 10,(జనం సాక్షి) వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం సోమవారం రోజున డిప్యూటీ తాహశీల్దార్ విరేష్ బాబు, చైల్డ్ లైన్ ప్రతినిధి హనుమంత్ రెడ్డి కలిసి బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ మాకు నీళ్ల చారు,ఉపాధ్యాయులకు మంచి విటమిన్ ఉన్న దొండకాయ కర్రీ,విద్యార్థిలకు కుళ్ళిపోయిన కోడిగుడ్లు జబ్బర్గా ఉన్న అన్నం పెడుతున్నారని తెలిపారు.ఈ విషయాలు గమనించిన డిప్యూటీ తాహశీల్దార్ వీరేష్ బాబు పర్యవేక్షించడంతో ఉపాధ్యాయులకు మంచి భోజనం,విద్యార్థులకు ఇలాంటి భోజనం మీరు ఎలా పెడతారు అని ప్రశ్నించారు.విద్యార్థిలకు కుళ్ళిన కోడిగుడ్లు ఎలా పెడతారు అని అడిగారు.ఈ విషయాలు విద్యార్థులు బయట చెప్పితే మమ్మల్ని కొడతానని బెదిరిస్తున్నాదని చెప్పారు.ఈ సంఘటన పైన డిప్యూటీ తాహశీల్దార్ విరేష్ బాబు ఉన్నత అధికార దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ప్రత్యేక అధికారి సుమిత్ర బాలికల విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఇలాంటి వారి పైన చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లిదండ్రులు పేర్కొన్నారు.