మున్సిపల్ భారీ పరిశ్రమ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు.
తంగళ్ళపల్లి లోప్రాథమిక ఆరోగ్య కేంద్ర స్థాయిలో రాష్ట్రంలోనే మొట్ట మొదటి పీజీయోథెరపీ క్లినిక్ ను ప్రారంభించిన మంత్రి కే టి ఆర్ రాజన్నసిరిసిల్లబ్యూరో ,ఏప్రిల్.10.(జనంసాక్షి) రాష్ట్రంలోనే మొట్ట మొదటి సారిగా ప్రాథమిక ఆరోగ్య కేంద్ర స్థాయిలో ఏర్పాటు చేసిన పీజీయోథెరపీ క్లినిక్ ను రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్ళపల్లి మండల కేంద్రం పి హెచ్ సి లో మున్సిపల్ ఐటీ భారీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సోమవారం ప్రారంభించారు. అనంతరం సేవలు పొందేందుకు వచ్చిన అమృతవ్వ అనే వృద్ధురాలి నీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పలకరించారు. బాగోగులు అడిగి తెలుసుకున్నారు.పీజీయోథెరపీ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోనీ స్వస్థత పొందాలని కోరారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఫిజియోథెరపీ సేవలు అందుబాటులోకి రానున్నాయి.కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, రాష్ట్ర పవర్లూం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు ,జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ , జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు, జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీరాములు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.




