వేమనపల్లి, ఏప్రిల్ 10, (జనంసాక్షి):వేమనపల్లి మండలంలో ఐకేపీలో పనిచేసే వీవోఏల సమ్మె సోమవారం నాటికి 8వ రోజుకు చేరుకుంది. సోమవారం మండల వ్యాప్తంగా వీవోఏలు తహసీల్దార్,ఎంపీడీఓ బ్యాంకు మేనేజర్ లకు వినతి పత్రాలు అందజేసి తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.అనంతరం ఎంపీడీఓ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించారు.




