ఒక్కో కుటుంబానికి – రూ.1లక్ష రుణమాఫీ
మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర సర్కారు
హైదరాబాద్,మార్చి 17(జనంసాక్షి): వ్యవసాయ రుణాల మాఫీకి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. 2014 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 20 18 డిసెంబర్ 11లోపు తీసుకున్న పంటరుణాలకు మాఫీ వర్తి స్తుందని మార్గదర్శకాల్లో ప్రభుత్వం పేర్కొంది. ఒక్కో కుటుం బానికి రూ.లక్ష వరకు రుణాలను మాఫీ చేయనున్నారు. పట్టణ ప్రాంతాల్లోని బ్యాంకుల నుంచి పంట కోసం తీసుకున్న బంగారం రుణాలకు మాఫీ వర్తించదని
ప్రభుత్వం స్పష్టం చేసింది. రూ.25వేల లోపు ఉన్న రుణాలను ఒకే దఫాలో.. రూ.లక్ష వరకు ఉంటే నాలుగు విడతల్లో మాఫీ చేస్తామని పేర్కొంది. ఆ మేరకు రైతులకు మాఫీ మొత్తాన్ని చెక్కుల ద్వారా అధికారులు అందించనున్నారు. గ్రామాలవారీగా లబ్దిదారుల జాబితా రూపొందించి మండల స్థాయిలో బ్యాంకర్ల ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసి జాబితా ఖరారు చేయాలని మార్గదర్శకాల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. రుణమాఫీ అమలు కోసం ప్రభుత్వం ప్రత్యేక వెబ్ పోర్టల్ ను ఏర్పాటు చేసి పర్యవేక్షించనుంది. – మార్గదర్శకాలు జారీ చేసిన సర్కారు .