ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తాను
జనం సాక్షి జనవరి 12. కొల్లాపూర్ రూరల్
కొల్లాపూర్ లొ పేదల రాజ్యం రావాలి ప్రజలకు న్యాయం జరగాలి అంటే బిజెపి పార్టీ రావాలి కెసిఆర్ మాట ఇచ్చి తప్పాడు డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు రుణమాఫీ చేయలేదు
కొల్లాపూర్‌లో ఎల్లేని సుధాకర్‌రావు పాదయాత్రలో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు బండి సంజయ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎల్లేని సుధాకర్ రావు
నెలకు నాలుగు లక్షల జీతం వదిలి ప్రజాసేవలో పని చేస్తున్నాడని ఒక్క అవకాశమిస్తే తనకు కొల్లాపూర్‌కు వంద పరిశ్రమలు తెస్తానని చెప్పారు ప్రజాసేవలో పట్టు వీడని విక్రమార్కుడిలా పని చేస్తున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎల్లేని సుధాకర్‌రావుపై ప్రశంసలు కురిపించారు.కొల్లాపూర్ ప్రగతి యాత్ర పేరుతో ఎల్లేని 36 రోజుల నుంచి నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించారు. గురువారం కొల్లాపూర్‌కు చేరిన ఈ పాదయాత్ర ముగింపు సందర్భంగా రాజా బంగ్లా ముందు ఏర్పాటు చేసిన బహిరంగ సభకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకు ముందు ఎల్లేని సుధాకర్‌రావుతో కలిసి ప్రజలకు అభివాదం చేస్తూ బహిరంగ సభకు చేరుకున్నారు బహిరంగ సభ ఆవరణలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం బహిరంగ సభా వేదికపై వివేకానంద చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలు గడిచిన ఎన్నికల్లో ఎల్లేని సుధాకర్‌రావుకు ఓట్లు వేయకున్నా ఇచ్చిన మాటకు కట్టుబడి వందల సార్లు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కల్వకుర్తి నుంచి కర్వెన వరకు జాతీయ రహ దారి, సోమశిల కృష్ణానదిపై వంతెన నిర్మాణం కోసం రూ.2,400కోట్లు మంజూరు చేయించి హైవే సుధాకర్‌గా గుర్తింపు పొందాడని అన్నారు. 36 రోజుల పాటు 500కిలో మీటర్లు పాదయాత్ర నిర్వహించి ప్రజల సమస్యలు గుర్తించిన ఎల్లేని సుధాకర్‌రావుకు ప్రజలు అవకాశమిచ్చి ఆశీర్వదిస్తే ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని అన్నారు. మాదాసి, మాదారి కుర్వ సమస్యలు, 98 జీవో బాధితుల సమస్య, వాల్మీకుల సమస్యలతోపాటు కొల్లాపూర్ కు రైల్వేలైన్ రావాలన్నా, పరిశ్రమలు కావాలన్నా బీజేపీతోనే సాధ్యమవుతుందని బండి సంజయ్ పేర్కొన్నారు. ఇన్నాళ్లు పనిచేసిన సిఎస్ సోమేశ్ కుమార్ కు పేదల ఉసురు తాకింది ఇన్నాళ్లు అతను చేసిన అవినీతి అక్రమాలపై విచారణ జరపాలించాలని డిమాండ్ చేశారు సర్పంచుల ఖాతాలో లో ఉన్న డబ్బులను కేసీఆర్ దొంగల దారి మళ్లించారని విమర్శించారు ఎమ్మార్పీఎస్ వినతిపత్రం సమర్పించారు ఎస్సీ వర్గీకరణ సమస్యపై ఎమ్మార్పీఎస్ నేతలు బండి సంజయ్ కి వినతిపత్రం అందజేశారు రాబోయే పార్లమెంటు సమావేశంలో ఎస్సీ వర్గీకరణకు చట్ట భద్రత కల్పించాలంటూ కోరారు.బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్‌రావు మాట్లాడుతూ కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలు తనకు ఒక్క అవకాశమిస్తే కొల్లాపూర్‌కు వంద పరిశ్రమలు తెస్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలులో కొల్లాపూర్ ఎమ్మెల్యే కూడా ఉండటం బాధాకరమన్నారు. ఒకే పార్టీలో ఉండి ఇద్దరు కలిసి దొంగనాటకామాడుతున్నారని 20సంవత్సరాలు వారు చేయలేని పనిని తనకు ఒక్కసారి అవకాశమిస్తే చేసి చూపిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా.జి.మనోహర్‌రెడ్డి, కార్యదర్శి కొల్లి మాధవి, అధికార ప్రతినిధి వీరేంద్రగౌడ్, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ ఇన్ చార్జి దిలీపాచారి, నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్‌రావు, వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాజావర్ధన్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు తమటం శేఖర్‌గౌడ్, రోజా రమణి, నాయకులు కేతూరి బుడ్డన్న తదితరులు పాల్గొన్నారు.
ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తాను




