Thursday, 5 November 2026

ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు పెంచాలి

ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు పెంచాలి
కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలి
ఈనెల 18న కంటి వెలుగు క్యాంపు ప్రారంభం
జిల్లా వైద్యాధికారి చందు నాయక్
రేగోడ్ // జనం సాక్షి //జనవరి:
వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వహించకుండా ఆసుపత్రిలో ప్రసవాలు పెంచాలని, సాధారణ ప్రసవాలు ప్రైవేట్ ఆస్పత్రులకు పంపవద్దని జిల్లా వైద్యాధికారి చందు నాయక్ అన్నారు. గురువారం మండల కేంద్రమైన రేగోడ్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా వారు మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత నాణ్యమైన వైద్యాన్ని ప్రజలకు బాధ్యతగా వైద్యం చేయాలన్నారు. ఈనెల 18వ తేదీన నిర్వహించనున్న కంటి వెలుగు కార్యక్రమంలో 93 క్యాంపులు నిర్వహించి రోజుకు 250 మందికి కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అవసరమైన వారికి కంటి అద్దాలను అందజేయనున్నట్లు తెలిపారు. కాగా కంటిలో పువ్వు ఉన్నవారికి ఆపరేషన్లు సైతం సంబంధిత ఆస్పత్రుల్లో చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారిని శ్వేత, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.