Wednesday, 4 November 2026

ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలి

కరీంనగర్‌, నవంబర్‌ 9 : అర్హులైన వారందరు ఎన్నికల ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని రాష్ట్ర ఓటర్ల నమోదు పరిశీలకులు శశిధర్‌ అన్నారు. శుక్రవారం కలెక్టర్‌ సమావేశ మందిరంలో ఓటర్ల నమోదు కార్యక్రమంపై రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటు ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు అని, ఎన్నికల సమయంలో ఓటర్ల జాబితాలో పేరు లేదని బాధపడే బదులు, ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నవంబర్‌ 15 వరకు గడువు ఉందని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వారికి రాజకీయ పార్టీలు సహకరించాలన్నారు. అలాగే అభ్యంతరాలుంటే తెలపాలన్నారు. రాజకీయ పార్టీలు వెంటనే బూత్‌ లేవల్‌ ఏజెంట్లను నియమించి జాబితాలు పంపాలని అన్నారు. రాజకీయ పార్టీలు వెంటనే బూత్‌ ఏజెంట్లను నియమించి జాబితాలు పంపాలని అన్నారు. ఓటర్ల చైతన్యవంతులు కావాలని, ఒకే చోట ఓటు హక్కు కలిగి ఉండాలని అన్నారు. జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ మాట్లాడుతూ, ముఖ్యంగా యువత ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని అన్నారు. జిల్లాలో యువత 1.93 శాతం మంది ఓటర్ల జాబితాలో నమోదు చేశారని, మిగిలిన 2 శాతం యువత ఓటరుగా నమోదు చేసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌, తెలుగుదేశం పార్టీ తరఫున వాసాల రమేష్‌, కాంగ్రెస్‌ పార్టీ తరఫున గోపి, టిఆర్‌ఎస్‌ తరఫున రాజేందర్‌రావు, రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *