Wednesday, 4 November 2026

19 నుంచి 25 వరకు 35వ సబ్‌. జూ. వాలీబాల్‌ పోటీలు

కరీంనగర్‌, నవంబర్‌ 9 : జిల్లాలోని రామడుగు మండలం వెదిర గ్రామంలో జిల్లా వాలీబాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 19 నుంచి 25 వరకు 35వ సబ్‌ జూనియర్‌ వాలీబాల్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వాలీబాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఆకారపు భాస్కర్‌రెడ్డి, ఛాంపియన్‌షిప్‌ జిల్లా ఆర్గనైజింగ్‌ అధ్యక్షులు జోజిరెడ్డి శుక్రవారం నాడు ఇక్కడ తెలిపారు. రామడగు మండలం వెదిరిలోని ఎన్‌వి మాతా ఇంగ్లీషు మీడియం హైస్కూల్‌ మైదానంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 25 రాష్ట్రాల నుంచి 49 టీంలు ఈ ఛాంపియన్‌ షిప్‌లో పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు. కరీంనగర్‌ జిల్లాలో మొట్ట మొదటి సారిగా జిల్లా యంత్రాంగం సహకారంతో అండర్‌ 19 విభాగంలో 35వ సబ్‌ జూనియర్‌ జాతీయ వాలీబాల్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఛాంపియన్‌ షిన్‌కు సంబంధించిన ఏర్పాట్లను చురుగ్గా చేస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *