Monday, 2 November 2026

ఓటర్ల దినోత్సవం నాడు కొత్త నమోదులు

విజయనగరం,జనవరి24(జ‌నంసాక్షి):  ఈనెల 25న నిర్వహించనున్న జాతీయ ఓటర్ల దినోత్సవం పండగ వాతావరణంలో నిర్వహించాలని ఎన్నికల అధికారి  కోరారు. ఎన్నికల కవిూషన్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా దినోత్సవాన్ని నిర్వహించాలని భావిస్తోందని, అంతా సమష్టిగా విజయానికి కృషి చేయాలన్నారు. కొత్తగా ఓటర్లను చేర్పించడం, సీనియర్‌ ఓటర్లను సన్మానించడం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వంటివి చేయాలన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం విజయవంతం చేయాలని కోరుతూ  విజయనగరం కోట నుంచి 2కె రన్‌ నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు విలువైందని, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని కోరారు. కళాశాల విద్యార్థులు ఓటుహక్కుపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని కోరారు.