Wednesday, 4 November 2026

ఓటర్ల నమోదు పరిశీలకు శశిధర్‌

కరీంనగర్‌, నవంబర్‌ 9 : అర్హులైన వారందరూ ఎన్నికల ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని రాష్ట్ర ఓటర్ల నమోదు పరిశీలకులు శశిధర్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఓటర్ల నమోదు కార్యక్రమంపై రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు అని, ఎన్నికల సమయంలో ఓటర్ల జాబితాలో పేరు నమోదుచేసుకోవాలని సూచించారు. రాజకీయ పార్టీలు వెంటనే బూత్‌లెవల్‌ ఏజెంట్లను నియమించి జాబితాలు పంపాలని అన్నారు. ఓటర్లు చైతన్యవంతులు కావాలని, ఒకే చోట ఓటు హక్కు కలిగి ఉండాలని అన్నారు. జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ మాట్లాడుతూ ముఖ్యంగా యువత ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని అన్నారు. జిల్లాలో యువత 1.93శాతం మంది ఓటర్‌ జాబితాలో చేరరాని అన్నారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌, తెలుగుదేశంపార్టీ తరఫున వాసాల రమేశ్‌, కాంగ్రెస్‌ పార్టీ తరఫున డి.గోపి, టి.ఆర్‌ఎస్‌ తరఫున సిహెచ్‌ రాజేందర్‌ రావు, బిజేపీ పార్టీ తరఫున జి. సతీష్‌, బిఎస్‌పి తరఫున సిహెచ్‌.రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *