Wednesday, 4 November 2026

53 మంది లబ్ధిదారులకు భూ పంపిణీ

కరీంనగర్‌, నవంబర్‌ 9 : ఆరవ విడత భూ పంపిణీ కార్యక్రమంలో భాగంగా చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర, మల్యాల, కొడిమ్యాల మండలాలకు చెందిన 53 మంది లబ్ధిదారులకు భూ పంపిణీ పత్రాలను శుక్రవారం చొప్పదండి శాసన సభ్యులు సుద్దాల దేవయ్య పంపిణీ చేశారు. కరీంనగర్‌ ఎంపిడివో కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన లబ్ధిదారులకు భూ పట్టా, రుణ హామీ పత్రాలను అందజేశారు. గంగాధర మండలంలోని 8 మందికి 4ఎకరాలు, మల్యాల మండలంలోని 13 మందికి 7.13 ఎకరాలు, కొడిమ్యాల మండలంలోని 32 మంది లబ్ధిదారులకు 40.09 ఎకరాలు కలిపి 51.25 ఎకరాలు భూ పంపీణీ చేశారు. లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా రుణం మంజూరు చేయడంతో పాటు ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల భూములను ఇందిర జలప్రభ కార్యక్రమం కింద సాగు యోగ్యం చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొఇన ఆర్థికాభివృద్ధి చెందాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డివో సంధ్యారాణి, తహశీల్దార్‌ గంగాధర్‌, గంగాధర్‌ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ అంజనీ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *