ఓటర్ జాబితాను రాజకీయ పార్టీ ప్రతినిధులకు అందజేసిన ఆర్డీవో రాములు
గద్వాల నడిగడ్డ, జనవరి 5 (జనం సాక్షి);
ఆగస్టు నుండి షెడ్యూల్ మొదలు పెట్టి కొత్త ఓటర్లను జాబితా లో చేర్చి ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటరు తుది జాబితా ను అందజేయడం జరుగుతుందని జనవరి 1,2023 నాటికీ 18 సంవత్సరాలు పూర్తయిన వారి ఓటర్ జాబితా రాజకీయ పార్టీ ప్రతినిధులకు అందజేయడం జరిగిందని గద్వాల ఆర్డిఓ రాములు తెలిపారు. గురువారం జిల్లా కలెక్టరేట్ సమావేశ ము హాలు లో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి నూతనంగా ప్రచురించిన ఓటరు జాబితాను పార్టీ ప్రతినిధులకు అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలలో 2018లో 4,43,938 మంది ఓటర్లు ఉండేవారని, జనవరి 1, 2023 నాటికి జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,57, 101 ఉన్నారని, వారిలో గద్వాల నియోజకవర్గంలో 2,34,633, ఓటర్లు, అలంపూర్ నియోజకవర్గం లో 2,27,428 మంది ఓటర్లు ఉన్నారని, వారిలో గద్వాల నియోజకవర్గంలో పురుషులు 1,16,167, మహిళలు 1,18,447, మంది, 9 మంది ట్రాన్స్ జెండర్లు, అలంపూర్ నియోజకవర్గంలో పురుషులు1,11024, మహిళలు 1,11,439 మంది ఓటర్లు ఉన్నారని ఆర్డీవో తెలిపారు. జిల్లాలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు శాతం ఎక్కువగా ఉందని అన్నారు. ఈ సమావేశంలో ఏం ఆర్ ఓ వెంకటేష్, సి సెక్షన్ సూపరింటెండెంట్ వరలక్ష్మి, బిజెపి తరుణ్ కుమార్, వై ఎస్ ఆర్ టి పి అతికుల్ రహమాన్, టి ఆర్ ఎస్ మహబూబ్, కాంగ్రెస్ షేక్ జమాల్, టిడిపి కేశవులు, బి ఎస్ పి కేశవ రావు, సత్యనారాయణ రెడ్డి, ధరణి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ఓటర్ జాబితాను రాజకీయ పార్టీ ప్రతినిధులకు అందజేసిన ఆర్డీవో రాములు




