క్రీడా ప్రాంగణాలను వెంటనే ఏర్పాటు చేయాలి
డి ఆర్ డివో నరసింహులు డిపిఓ సురేష్
గోపాల్ పేట్ జనం సాక్షి జనవరి (05): మండలంలోని తాడిపర్తి, గోపాల్ పేట్, చాకల్ పల్లి, గ్రామాలలో డి ఆర్ డి ఓ నరసింహులు, డిపిఓ సురేష్ లు పర్యటించారు గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను ఇంకా పూర్తి చేయలేదని ఆ గ్రామాల సర్పంచులను ప్రశ్నించారు వారు మాట్లాడుతూ క్రీడా ప్రాంగణాలను పూర్తి చేయాల్సిందిగా వారు సర్పంచ్ లకు సూచించారు అదేవిధంగా నర్సరీలను సందర్శించి విత్తనాలు మొలవని బ్యాగ్ లో తిరిగి విత్తనాలు నాటలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో సర్పంచులు పొడవు శ్రీనివాసులు, పద్మ, నరహరి, ఎంపీడీవో హుస్సేనప్ప, ఏపీవో నరేందర్, పంచాయతీ కార్యదర్శులు, టిఏలు తదితరులు పాల్గొన్నారు




