Wednesday, 4 November 2026

ఓటర్ నమోదు, తప్పుల సవరణ పై తహసిల్దార్ సమావేశం

 జనంసాక్షి, రామగిరి: పెద్దపల్లి జిల్లా
రామగిరి మండలములో సి. రాంమోహన్, తహశీల్దార్ అద్వర్యములో ఎస్ఎస్ఆర్-2023 లో బాగంగా మండలములోని రాజకీయ పార్టీల అధ్యక్షులతో, బి ఎల్ ఓ లతో శనివారం సమావేశం నిర్వహించారు. అక్టోబర్ 1, 2023 నాటికి (18) సంవత్సరాలు నిండిన వారిని నూతన ఓటరుగా నమోదు చేసుకొనుటకు, మరణించిన శాశ్వతముగా గ్రామము వదిలి వేల్లిపోయిన వారిని గుర్తించి తొలగించుటకు, ఓటరుగా నమోదు అయి ఉండి తప్పులు ఉంటె సవరణలు చేసుకొనుటకు అవగాహన కల్పించినారు. బి ఎల్ వో లు అందరు డోర్ టూ డోర్ సర్వే నిర్వహించి ఓటరు జాభిత లో మార్పులు చేర్పులు ఉన్నచో సవరణలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాకేష్ నాయబ్ తహశీల్దార్, మండల గిర్ధవార్ రాజబాబు, పార్టీల తరుపున మ్యదరబోయిన కుమార్, ముర్మురి శ్రీనివాస్, జనగామ రవి కుమార్, బిఎల్వోలు, కార్యాలయ సిబ్బంది హాజరైనారు.