రుద్రుర్ (జనంసాక్షి): చేెవెళ్ల సభలో కేంద్ర హోంమత్రి అమిత్ షా మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని చేసిన ప్రకటనకు రుద్రుర్ మైనార్టీలు అమిత్ షా పై ఘాటుగా స్పందించిన విషయం తెలిసినదే, రుద్రుర్ మైనార్టీలు చేసిన విమర్శలుకు సమాధానంగా బుధవారం రోజున బిజెపి మండల అధ్యక్షుడు సుధాకర్ గౌడ్ రుద్రుర్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీజేపీ ఎప్పుడు ఏ మతానికో , ఒక కులానికి వ్యతిరేకం కాదని, దేశ ప్రయోజనల కోసం, సమన్యాయం కోసమే కఠిన నిర్ణయలు తమ పార్టీ తీసుకుంటుందని తెలిపారు, మత ప్రాతిపదికన అఖండ భారత దేశాన్ని ఎవరు ముక్కలు చేసారో ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు, రాజకీయంగా మైనార్టీ రిజర్వేషన్లు ద్వారా అనర్హులు లబ్ధి పొందుతున్నారని , అర్హులకు న్యాయం చేయాలని ఈ ప్రకటన చేసారని తెలిపారు, మైనార్టీలు అంటే ఒక వర్గం మాత్రమే కాదని , ఎద్దవా చేశారు, ఇతర పార్టీల లాగాఓట్ల కోసం కాదు , దేశ రక్షణ మరియు ప్రజల శ్రేయస్సు కోసమె బీజేపీ నిర్ణయలు తీసుకుంటుందని తెలిపారుఈ కార్యక్రమంలో సుధాకర్ గౌడ్, తొట్ల శంకర్, గణేష్ , కృష్ణంరాజు, గంగాధర్, ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు




