Tuesday, 3 November 2026

ప్రైవేట్ కు హరతులు

 

 

 

 

 

 

 

ప్రైవేట్ యూనివర్శిటీలకు హరతులు ఇస్తూ, ప్రభుత్వ యూనివర్శిటీలను నిర్లక్ష్యం చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వ వైఖరి నశించాలని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు _తెలంగాణలో ప్రభుత్వ యూనివర్శిటీలను నాశనం చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం కంకణం కట్టుకున్నదని విద్యార్థి జన సమితి జిల్లా అధ్యక్షుడు బచ్చలి ప్రవీణ్ కుమార్ అన్నారు రాష్ట్రం ఏర్పడి తొమ్మిది ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ యూనివర్శిటీలలో మౌలిక వసతులు కల్పించలేని కేసీఆర్ ప్రభుత్వం తన పార్టీ నేతలు పళ్ల రాజేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి, వరద రెడ్డి ల కు ప్రైవేట్ యూనివర్శిటీలకు అనుమతులు ఇచ్చారని తెలిపారు ప్రైవేట్ యూనివర్శిటీల బిల్లును గవర్నర్ గారు తిప్పి పంపిన కేసీఆర్ ప్రభుత్వ స్పందన లేదని విమర్శించారు తక్షణమే ప్రైవేట్ యూనివర్శిటీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు అలాగే ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిత్యం గురి అవుతున్న తెలంగాణ ఉద్యమ కేంద్రాలు అయిన ప్రభుత్వ యూనివర్శిటీలలో మౌలిక వసతులు కల్పించాలని అధ్యాపక అధ్యాపకేతరా ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో కేసీఆర్ ప్రభుత్వానికి విద్యార్థుల నిరసన తప్పదని హెచ్చరించారు.