స్పాట్ రిజిస్టేష్రన్‌కు అవకాశం
హైదరాబాద్,జూలై17(జనం సాక్షి): డా.బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయంలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే అర్హతా పరీక్షలో పాల్గొనదల్చుకున్న అభ్యర్థులకు స్పాట్ రిజిస్టేష్రన్ చేసుకునే అవకాశం కల్పించారు. ఈ నెల 22న నిర్వహించనున్న అర్హతా పరీక్షను రాయాలనుకునే వారు జూబ్లీహిల్స్ రోడ్‌లోని 46లోని అంబేద్కర్ వర్సిటీకి వచ్చి పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఈ మేరకు వర్సిటీ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. సర్టిఫికెట్లను, ఫొటోలు, నిర్దేశిత ఫీజును వర్సిటీలో నేరుగా అందజేస్తే అర్హతా పరీక్షలో పాల్గొనవచ్చని వారు పేర్కొన్నారు.




