సాయం చేయలేని స్థితిలో వెంకయ్య నాయుడు
ఉపరాష్ట్రపతిగా వెళ్లడంతో ఏడాదిగా సమస్యలే
కేంద్రంతో సమన్వయం చేసే వ్యక్తి లేక సతమతం
అమరావతి,జూలై17(జనం సాక్షి): వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి అయ్యాక ఆ పరిణామం ప్రభావం నవ్యాంధ్రపై స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వంలో నేరుగా జోక్యం చేసుకునే అవకాశం లేకపోవడంతో ఓ రకంగా కేంద్ర రాష్ట్ర సబంధాలు బెడిసి కొట్టాయన్నా భావన కలుగుతోంది. దానిపై ఆంధ్రప్రదేశ్ ఎంపీలు, మంత్రుల్లో తర్జనభర్జన నడుస్తోంది. ఉపరాష్ట్రపతి పదవికి ఆయనను ఎంపిక చేయడంతోనే ఎపికి శాపంగా మారిందన్న భావన కలిగింది. ఇప్పుడు ప్రత్యక్షంగానే దాని ప్రభావం కనిపిస్తోంది. ఆయన మంత్రిగా ఉండివుంటే ఇపిలో ఇలాంటి పరిస్తితులు ఉత్పతన్నం అయ్యేవి కావని అంటున్నారు. ఈ పరిణామంపై రాష్ట్ర ఎంపీలు, రాజకీయ వర్గాల్లో భిన్నమైన కోణంలో చర్చలు జరుగుతున్నాయి. కొత్తగా పురుడు పోసుకున్న నవ్యాంధ్రకు తీరని నష్టమేనని ఆందోళన చెందినదే ఇప్పుడు నిజమయ్యిందంటున్నారు. 2014లో కేంద్రంలో ఎన్‌డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ తరపున గట్టిగా నిలబడి ప్రతి సందర్భంలోనూ ఆయన తన వంతు సాయం అందిస్తూ వచ్చారు. ఇప్పుడు ఉప రాష్ట్రపతిగా ఎన్నికైతే.. రాజ్యాంగ పరిమితులకు లోబడి.. గతంలో మాదిరిగా క్రియాశీల పాత్ర పోషించలేని స్థితిలో ఉన్నారు. గతంలో ఏ సమస్యపై ఢిల్లీ వెళ్లినా ఆయన ఒక పెద్ద అండగా ఉండి సహాయపడేవారు. ఇతర మంత్రులతో కలసి మాట్లాడే వారు. మమ్మల్ని కేంద్ర మంత్రుల వద్దకు తీసుకెళ్లేవారు. లేదంటే వారినే పిలిపించుకుని మాట్లాడించేవారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కారం కావడంలో ఆయన పాత్ర ఉంది. ఉప రాష్ట్రపతి కావడంతో ఇప్పుడు ఆయన ఇంత క్రియాశీలంగా ఉండడం లేదు. ఆ ¬దాలో ఒక రాష్ట్రం కోసం ప్రయత్నించడం ఆయనకూ ఇబ్బంది అవుతుందని ఒక ఎంపీ అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా ఇవ్వలేమని, దాని బదులు ప్రత్యేక సాయం ఇస్తామని కేంద్రం ప్రకటించిన సందర్బంలో వెంకయ్య పాత్రా ఉంది. ఇప్పుడు దానిపై గట్టిగా పోరాడినా ఫళితం లేకుండా పోయింది.
ప్రత్యేక సాయాన్ని వివిధ శాఖల నుంచి సాధించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో చాలా పెద్ద ప్రయత్నం చేయాల్సి వచ్చింది. ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వస్తే కేబినెట్ మంత్రిగా వెంకయ్యనాయుడు చొరవ తీసుకుని మాట్లాడే వారు. ఆయన సీనియారిటీ రీత్యా మిగిలిన మంత్రులు ఆయన చెప్పినప్పుడు స్పందించే వారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తరచూ కేంద్రంలో పెండింగ్‌లో ఉన్న అంశాలపై
వెంకయ్యతో మాట్లాడేవారు. నిధుల విడుదల తదితర అంశాల్లో ఆయన సాయం తీసుకుంటూ వచ్చారు. రాష్ట్ర విభజన ముందు రాజ్యసభలో జరిగిన చర్చలో వెంకయ్య చురుగ్గా పాల్గొన్నారు. ఆ రోజు బీజేపీ తరపున ఇచ్చిన హావిూలను, ఇక్కడి అవసరాలను ఆయన తమ కేంద్ర నాయకత్వం లేదా ప్రధాని కార్యాలయం దృష్టికి తేగలిగారు. కానీ ఇప్పుడు కేంద్రం దృష్టిలో దేశంలోని 29 రాష్టాల్లో నవ్యాంధ్ర కూడా ఒకటి. ప్రతి రాష్ట్రం నిత్యం కేంద్ర సాయం కోసం ఒత్తిడి తెస్తూనే ఉంటుంది. కొత్త రాజధానిలో రాష్ట్ర ప్రభుత్వం భారీ నిర్మాణాలకు సంకల్పిస్తోంది. అదే సమయంలో పోలవరం వంటి భారీ ప్రాజెక్టుల నిర్మాణాలను కూడా వేగంగా నడిపిస్తోంది. కేంద్రం ఇచ్చే సాయంపైనే వీటి పురోగతి ఆధారపడి ఉంది. ఈ
సమయంలో వెంకయ్య ఉప రాష్ట్రపతి పదవిలో ఉండడం, ఎన్‌డిఎ నుంచి టిడిపి బయటపడడం లాంటి చర్యల కారణంగా మందగమనం తప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ వర్గాలను కూడా ఇది కలవరవరుస్తోంది.
——