Tuesday, 3 November 2026

ఓపెన్ టెన్త్,ఇంటర్ అడ్మిషన్లకు చివరి అవకాశం

తిరుమలగిరి (సాగర్) నవంబరు 5 ,(జనంసాక్షి):
ఓపెన్ టెన్త్,ఇంటర్ లో 2022 – 23 సంవత్సరానికి అడ్మిషన్ పొందుటకు నవంబర్ 10వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు శ్రీ చైతన్య ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ ఎల్. బ్రహ్మచారి ఒక ప్రకటనలో తెలిపారు.ఈ మేరకు శనివారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో ఓకే ఏడాదిలో నేరుగా ఓపెన్ టెన్త్ పూర్తి చేసుకునే అవకాశంతో పాటు,పదవ తరగతి పాస్ అయిన విద్యార్థులు ఏడాదిలో ఇంటర్ పూర్తి చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.ఆసక్తి కలిగిన అభ్యర్థులు పదవ తరగతి అడ్మిషన్ పొందుటకు రికార్డ్ షీట్,కుల ధ్రువీకరణ పత్రము,ఆధార్ కార్డ్ ను,ఇంటర్లో అడ్మిషన్ పొందుటకు పదో తరగతి మెమో,కుల దృవీకరణ పత్రము,ఆధార్ కార్డులను సమర్పించాలని తెలిపారు.పూర్తి వివరాలకు శ్రీ చైతన్య స్కూల్,గ్రేట్ స్కూల్ 9705293926,9573501510 లను సంప్రదించాలని కోరారు.